రామగిరి: విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ సూచించారు. పన్నూర్ మంథని జేఎన్టీయూలో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఓరియేంటేషన్ డేలో సింగరేణి ఆర్జీ–3, ఏపీఏ జీఎంలు మధుసూదన్, నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఏసీపీ మాట్లాడుతూ, విద్యార్థులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలన్నారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉత్సాహంతో ఉండాలని సూచించారు. లక్ష్యం కోసం పట్టుదలతో శ్రమించాలని, పరిజ్ఞానాన్ని సమాజం కోసం వినియోగించాలని, సమయపాలన కచ్చితంగా పాటించాలని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. కళాశాల పరిసరాల్లో పోలీసు ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్‌కుమార్, మంథని సీఐ స్వామి, రామగిరి ఎస్సై శ్రీనివాస్, విద్యార్థులు, తల్తిదండ్రులు పాల్గొన్నారు.


