తప్పుల్లేకుండా ‘భూభారతి’ | - | Sakshi
Sakshi News home page

తప్పుల్లేకుండా ‘భూభారతి’

Aug 6 2026 7:50 AM | Updated on Aug 6 2026 7:50 AM

డీఎఫ్‌వో ఆఫీస్‌ తరలింపు పెద్దపల్లిరూరల్‌: కలెక్టరేట్‌లోని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌వో) కార్యాలయాన్ని సబ్బితం గ్రామంలోని ఫారెస్ట్‌ నర్సరీ భవనంలోకి మా ర్చారు. కలెక్టరేట్‌లోని డీఎఫ్‌వో కార్యాలయానికి కేటాయించిన గది కార్యకలాపాలకు సరి పోవడం లేదని, దీంతోనే తరలించారని తెలిసింది. సబ్బితంలోని ఫారెస్ట్‌ నర్సరీలో విధులు నిర్వర్తించే అధికారులు నివాసం ఉండేందుకు వీలుగా రూ.కోటి అంచనాతో రెండు భవనాలు నిర్మించారు. ఇటీవలే ప్రభుత్వ విప్‌ వాటిని విజయరమణారావు ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని డీఎఫ్‌వో ఆఫీసు నుంచి సామగ్రిని సబ్బితంలోని భవనాల్లోకి తరలిస్తున్నామని ఫారెస్టు అధికారులు తెలిపారు.

పెద్దపల్లి: తప్పిదాలకు తావులేకుండా భూభారతి సేవలు అందించాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించారు. జూనియర్‌ అసిస్టెంట్లకు బుధవారం భూభారతిపై శిక్షణ ఇచ్చారు. శ్రీరాములు మాట్లాడుతూ, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన భూసేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా సేవలు అందించాలని సూచించారు. డీ విభాగం పర్యవేక్షకుడు ధీరజ్‌, ట్రైనర్లు సతీశ్‌, శ్రీనివాసరెడ్డి, సయ్యద్‌ తాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

నేతకానిగా మార్చాలి

రామగుండం: నే తకాని పేరుకు న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఢిల్లీ లో కేంద్ర సామాజిక, న్యాయ మంత్రి వీరేంద్రకుమార్‌ను బుధవారం ఎంపి కలిసి ఈమేరకు వినతిపత్రం అందించారు. గెజిట్‌లో నేతకాని సామాజికవర్గం పేరు నేట్కాని అని తప్పుగా నమోదు చేశారనినే మంత్రికి వివరించారు. దానిని నేతకానిగా సవరించాలని కోరారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ ఎంపీ పేర్కొన్నారు.

ఉద్యోగాలకు ఎంపిక

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ఐటీఐలో బుధవారం నిర్వహించిన మెగా అప్రెంటిస్‌ షిప్‌, జాబ్‌మేళాలో 364 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్‌ బుసిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మొత్తం 528 మంది హాజరుకాగా, 364 మంది ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. కళాశాల సిబ్బంది, పలు కంపెనీలో ప్రతినిధులు పాల్గొన్నారు.

ముగిసిన ఐసెట్‌ వెరిఫికేషన్‌

గోదావరిఖనిటౌన్‌: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో చేపట్టిన తొలివిడత ఐసెట్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ బుధవారం ముగిసిందని ప్రి న్సిపాల్‌ మనోహర్‌ తెలిపారు. ఈనెల 3 నుంచి ఇప్పటివరకు 250 మంది విద్యార్థులు వెరిఫికేషన్‌లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. తమకు కేటాయించిన ఆప్షన్‌ల ద్వారా విద్యార్థు లు లాగిన్‌ ఇవ్వాలని సూచించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్‌లు పొందేందుకు ఎస్‌యూజీఏఎస్‌ను తొలిప్రాధాన్యతగా ఇవ్వా లని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెరిఫికేషన్‌ అధికారులు ప్రసాద్‌, సుధ, అంబిక, శ్యా మ్‌ప్రసాద్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీలో ప్రత్యేక ప్రవేశాలు

పెద్దపల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్‌ అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా స్పెషల్‌ ఫే జ్‌ అడ్మిషన్లు ప్రారంభమైన ట్లు ప్రిన్సిపాల్‌ లక్ష్మీనరసయ్య తెలిపారు. ఖాళీగా ఉన్నసీట్ల భర్తీ కోసం ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు ఈప్రియ చేపట్టామ ని వెల్లడించారు. కళాశాలలో బీకాం(బీఎఫ్‌ఎస్‌ఐ), బీఎస్సీ (బీజెడ్‌సీ–లైఫ్‌ సైన్సెస్‌), బీఎస్సీ(ఎంపీసీఎస్‌), బీఏ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని, డిగ్రీలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement