రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Aug 9 2026 2:40 AM | Updated on Aug 9 2026 2:40 AM

జ్యోతినగర్‌: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్‌గే ట్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. కరీంనగర్‌ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు ఎన్టీపీసీ లేబర్‌గేట్‌ వద్ద రహదారి పక్కన ఆగింది. అదేసమయంలో పెద్దపల్లి నుంచి గోదావరిఖని వైపు వేగంగా వస్తున్న ఆటో ఆగిఉన్న బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ ఎండీ షబ్బీర్‌తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహానందు, చందు, మల్లవ్వ, గట్టమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద వివరాలను సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు.

విద్యుత్‌ తీగలు చోరీ

కాల్వశ్రీరాంపూర్‌: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం గంగారం గ్రామ పంచాయ తీకి చెందిన నల్లాలబావి విద్యుత్‌ తీగలు చో రీకి గురైనట్లు సర్పంచ్‌ రేకుల జ్యోతి తెలిపా రు. శనివారం తెల్లవారు జామున గుర్తించిన పంపు డ్రైవర్‌.. చోరీ విషయాన్ని సర్పంచ్‌కు చేరవేశారు. దీంతో పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చే సినట్లు సర్పంచ్‌ పేర్కొన్నారు. కరెంట్‌ తీగలు చోరీకి గురికావడంతో గ్రామంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయ కలిగిందని, వెంటనే కొత్తవైర్లు బిగించి సరఫరా పురుద్ధరించామని ఆమె వివరించారు. పోలీసులు దొంగలను పట్టుకుని ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని కోరారు.

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

మంథని: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గోదావరిఖ ని ఏసీపీ రమేశ్‌ శనివారం తనిఖీ చేశారు. స్టే షన్‌ పరిసరాలు, రికార్డులు, ఫైళ్లు పరిశీలించా రు. పెండింగ్‌లోని ఫిర్యాదులు, కేసులను స కాలంలో పరిష్కరించాలని అధికారులను ఆ దేశించించారు. నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, కోర్టులతో సమన్వయంతో పనిచేస్తూ నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ బాధితులకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఏసీపీ గుర్తుచేశారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన.. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ స్వామి, ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

పెగడపల్లి: రాములపల్లికి చెందిన రాచర్ల మాణిక్యం (46) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్‌ తెలిపారు. కూలి పని చేసుకుంటూ ఒంటరిగా నివాసముంటున్న మాణిక్యం కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement