విత్తనం నుంచి విపణి వరకు.. ‘భారత్ విస్తార్’కు డిజిటల్ తోడు అన్నదాత అరచేతిలో సమగ్ర సమాచారం పంట నుంచి మార్కెట్‌కు తరలించే వరకు స్మార్ట్ సలహాలు ఫొటో పంపితే తెగుళ్ల నిర్ధారణ.. స్థానిక భాషలో శాసీ్త్రయ సలహాలు
సమగ్ర సమాచారం ఒకే చోట: ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్‌లు, పరిశోధన కేంద్రాల నుంచి వచ్చే సమాచారాన్ని ఒకేగొడుగు కిందకు తీసుకొచ్చి, రైతులకు సులభంగా అర్థమయ్యేలా ఏఐ వ్యవస్థ విశ్లేషించి చెబుతుంది.
ఉచిత డౌన్‌లోడ్ సౌలభ్యం: గూగుల్ ప్లేస్టోర్ ద్వారా ఎవరైనా ‘భారత్ విస్తార్’ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
స్థానిక భాషల్లో సేవలు: సంక్లిష్టమైన శాసీ్త్రయ సమాచారాన్ని రైతులు మాట్లాడే స్థానిక భాషల్లోకి అనువదించి మరీ ఈ సలహాలిస్తుంది.
సాక్షి పెద్దపల్లి:
పొలంలో పంటను పీడిస్తున్న తెగులు ఏదో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఏ కాలంలో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో లెక్కలు వేసుకుని తలపట్టుకుంటున్నారా? దిగుబడిని ఎక్కడ విక్రయించాలో, ఈరోజు మార్కెట్ డిమాండ్ ఎంత ఉందనే సందిగ్ధంలో ఉన్నారా? ఇకపై అన్నదాతలు ఈ సమస్యలన్నింటికీ ఆందోళన చెందాల్సిన పన్లేదు. ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో కూడిన ‘భారత్ విస్తా ర్’ అనే అత్యాధునిక డిజిటల్ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విత్తనం నుంచి విపణి(మార్కెట్) వరకు సమస్త సమాచారాన్ని అరచేతిలో ఉంచుతున్న స్మార్ట్ యాప్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
రైతులకు ప్రధాన ప్రయోజనాలివే..
ఏఐ టూల్ విశేషాలు


