‘ఎల్లంపల్లి’పై విద్యుత్‌ దీపాలు ఏవి? | - | Sakshi
Sakshi News home page

‘ఎల్లంపల్లి’పై విద్యుత్‌ దీపాలు ఏవి?

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

రామగుండం: పవిత్రమైన గోదావరినదిపై ని ర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకు విద్యుత్‌ దీపాల అలంకరణ లేదు. వరద నీటితో జలకళ సంతరించుకుని, గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న క్రమంలో ఉప్పొంగే వరద నీటి అందాలు విద్యుత్‌ వెలుగుల్లో కనిపించే దృశ్యాలు అంతాఇంతాకావు. హైందవ ధర్మం, గోదావ రి పవిత్రతను గుర్తించి పర్యాటకులను ఆకర్షించే రీతిలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రంగురంగుల విద్యుత్‌ దీపాలను అలంకరించాలని ప ర్యాటకులు కోరుతున్నారు. ఈ విషయమై నీ టిపారుదల ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలంటున్నారు.

అనుమానాస్పద స్థితిలో 500 కోళ్లు మృతి

ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలోని అరికిళ్ల చంద్రయ్యకు చెందిన సుమారు 500 నాటుకోళ్లు అనుమానాస్పదస్థితిలో మృత్యువాతపడ్డాయి. తన ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో దాదాపు 1,000 నాటు కోళ్లు పెంచుతున్నాడు. మంగళవార ఉదయం నిద్రలేచి చూసేసరికి ఒక్కోటి కిలోవరకు బరువు పెరిగిన దాదాపు 500 కోళ్లు మృతిచెందాయి. విషప్రయోగంతోనే ఇలా జరిగి ఉంటుందని బాధితుడు చంద్రయ్య ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. వీటివిలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నాడు. ఈమేరకు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

బొగ్గు బ్లాక్‌తో సింగరేణికి భవిష్యత్‌

గోదావరిఖని: పీకే ఓసీ–2 డీప్‌సైడ్‌ కోల్‌బ్లాక్‌ కేటాయించడం ద్వారా సింగరేణికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. ఆర్జీ – వన్‌ ఏరియా వర్క్‌షాప్‌లో కార్మికులకు మంగళవారం మిఠాయిలు పంచిపెట్టి మాట్లాడారు. బీఎంఎస్‌ నాయకులు నాయకులు గట్టయ్య, భాస్కర్‌, గుండబోయిన భూమయ్య, బోడకుంట సుభాష్‌, ఊరగొండ అపర్ణ, జక్కన బాలు, బూడిద హర్ష, జక్కుల పద్మ, ప్రవీణ్‌, తాళ్లపల్లి నరేశ్‌, నడిగట్టు రాజేందర్‌, హనుమాన్ల వెంకటేశ్‌, అనిల్‌, ఆకునూరు రమేశ్‌, కొల్లూరి శ్రీకాంత్‌, అనిల్‌నాయక్‌, మాడ ప్రభాకర్‌, మిస వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి పట్టివేత

గోదావరిఖని: విఠల్‌నగర్‌ వాటర్‌ ట్యాంక్‌ వ ద్ద ఒకవ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు అక్కడకు చేరుకుని పట్టుకున్న ట్లు వన్‌టౌన్‌ ఎస్‌ఐ అనూష తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించగా తనిఖీ చేస్తే 250 గ్రాముల గంజాయి లభించిందన్నారు. ఈజీ గా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో రైలు లో మహారాష్ట్ర చంద్రాపూర్‌ వెళ్లి గుర్తుతెలియ ని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చే సి ఇక్కడకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడని వెల్లడించారు. నిందితుని నుంచి సెల్‌ఫోన్‌, గంజాయి స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement