గోదావరిఖని: సింగరేణి కార్మికుల 12వ వేజ్‌బోర్డు ప్రక్రియ ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘా లు డిమాండ్ చేశాయి. సోమవారం ఆర్జీ–వన్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బొగ్గుగని కార్మికుల వేతనాలు పెంచాలని, నాలుగు లే బర్ కోడ్‌లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయవ ద్దని కోరారు. వేజ్‌బో ర్డు కాలపరిమితి గత జూన్ 30తో ముగిసిందని, జూలై 1 నుంచి వేజ్‌బోర్డు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని, కోలిండియా ఇంతవరకు ప్రారంభించలేదని విమర్శించారు. 51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘంతో వేతన సవరణ జరుపుతామంటామే కేంద్ర కార్మిక సంఘాలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. కొరిమి రాజ్‌కుమా ర్, ధర్మపురి, ఎస్.వీరయ్య, తుమ్మల రాజారెడ్డి, సతీశ్, శ్రీను, ఎల్లాగౌడ్, సదానందం పాల్గొన్నారు.


