ప్రభుత్వం, అధికారులు తీసుకున్న నిర్ణయంతో గీతకార్మికులు సంఘటితమై ఎన్నికలు జరుపుకునే అవకాశం ఉంది. గ్రామాల్లో గౌడ సంఘం చైర్మన్‌కు ఒకప్పుడు ప్రజల నుంచి సానుభూతిఉండేది. క్రమంగా అదితగ్గుతూ వస్తోంది. పూర్వ వైభవం తీసుకురావడానికి కమిటీలు దోహదపడతాయి.
– వీరగోని రమేశ్‌గౌడ్, గర్రెపల్లి
క్రియాశీలకమవుతాయి
గీత పారిశ్రామిక సహకార సంఘాలకు ఐదేళ్ల క్రితం ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాలు లేవక గీతకార్మికులు సంఘటితం కావడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నోటీసులు జారీచేస్తున్నాం. ఎన్నికలు నిర్వహించి క్రియాశీలకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
– శ్రీనివాసమూర్తి, సూపరింటెండెంట్, ఎకై ్సజ్


