ఫెర్టిలైజర్‌సిటీ: వీర్లపల్లిలోని వ్యవసాయ పొ లాలు పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీటితో కలుషితమవుతున్నాయి. సింగరేణి, ఆర్‌ఎఫ్ సీఎల్ నుంచి వస్తున్న వర్షనీరు, వ్యర్థాలతో దాదాపు 20 ఎకరాలు నీటిలో ఉంటున్నాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి వచ్చిన వరదనీరు పంటలను ముంచెత్తింది. ఎన్టీపీసీ రైల్వేబ్రిడ్జి వద్ద ఓపెన్‌కాస్ట్ మ ట్టి పేరుకుపోయి మురుగు, వరదనీరు పంటలను ముంచెత్తాయి. రూ.లక్షలు వెచ్చించి వ రినాట్లు వేసిన రైతులు.. పంటనీటిపాలు కా వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిసమస్య పరిష్కరించాలని సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ప్రభుత్వం పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
వేలం గడువు పొడిగింపు
పెద్దపల్లి : స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీయార్డులోని 13 వాణిజ్య దుకాణాలను బ హిరంగ వేలం ద్వారా అద్దెకు కేటాయించేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మ ల్లారెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఈనెల 13 వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఆసక్తి గలవారు రూ.3,000 చెల్లించి దరఖాస్తు ఫారాలను పొందవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం 73307 33468, 73307 33318 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


