పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ క ళాశాల షాపింగ్ కాంప్లెక్స్‌లోని 25 షెట్టర్లను బుధవారం సీజ్ చేశారు. టెండర్ గడువు ముగిసినా ని ర్వాహకులు గదులు ఖాళీ చేయకపోవడంతో ఐదుసార్లు నోటీసులు జారీచేశామని, అయినా స్పందించకపోవడంతో ఈ చర్యలు చేపట్టామని ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి తెలిపారు. కాంప్లెక్స్‌లో 26 షట్టర్లు ఉండగా ఆరు నెలల క్రితం ఒకటి స్వాధీనం చేసుకు న్నామన్నారు. పోలీసు, మున్సిపల్, కళాశాల సి బ్బంది బందోబస్తు చర్యల్లో పాల్గొన్నారు.
ఓపెన్ టెండర్‌కు సన్నాహాలు
బహిరంగ మార్కెట్‌లో ఒక్కో షట్టర్ అద్దె రూ.13 వేలు పలుకుతోంది. ప్రస్తుతం రూ.8,000 చొప్పున చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్కోషట్టర్‌కు రూ.5వేల చొప్పున ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు గుర్తించిన సంబంధిత శాఖ అధికారులు.. ఇకపై ఓపెన్ టెండర్ ద్వారా గదులు అద్దెకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టెండర్ గడువు ముగిసినా ఖాళీ చేయని నిర్వాహకులు
పోలీసులు బందోబస్తు మధ్య 25 గదులు సీజ్


