● స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
పాలకుర్తి: ధర్మారం క్రాస్‌రోడ్డు వద్ద కన్నాల గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 425లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందు కు యత్నించగా రెవెన్యూ అధికారులు శనివా రం అడ్డుకున్నారు. ఆ భూమిని గతంలో జిల్లా కోర్టు నిర్మాణం కోసం సేకరించారు. అప్పటి జిల్లా జడ్జికి భూమిపత్రాలను అందజేశారు. జిల్లా కోర్టు నిర్మాణానికి పెద్దపల్లి సమీపంలో ని రాఘవాపూర్ శివారులో భూమి కేటాయించారు. బీడుగా ఉన్న కోర్టు భూమిపై కొందరు రియల్టర్ల కన్నుపడింది. రెండు, మూడు రోజులుగా ట్రాక్టర్‌తో చదును చేస్తున్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రాజేశ్వరరావు, ఆర్‌ఐ సంతోష్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రభుత్వ భూమి అని సూచించేలా సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈభూమిని ఆక్రమిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


