గోదావరిఖని: ప్రజాసమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే పోలీసుల లక్ష్యమని రామ గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. పోలీస్ కమిషనరేట్‌లో సోమ వారం ప్రజాఫిర్యాదులు స్వీకరించారు. ప్రతీ ఫిర్యా దును నమోదు చేసి, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలు, ఇబ్బ ందులు ఎదుర్కొన్నా భయపడకుండా ప్రజలు పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
‘ఫీజు’ ఎత్తివేసేందుకు కుట్ర
పెద్దపల్లిరూరల్: ఫీజురీయింబర్స్‌మెంట్‌ను ఎ త్తివేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ఆరోపించారు. స్థానిక రాజీవ్‌రోడ్డుపై సోమవారం బైఠాయించారు. పేద విద్యార్థులు ఉన్నత చదు వులకోసం దివంగత సీఎం వైఎస్సార్ అమల్లో కి తీసుకొచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకా న్ని కొనసాగించడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఫలితంగా వేలాది మంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయన్నారు. బకాయి ఫీజు లను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు సందీప్, ఓమేశ్, అరవింద్, విఘ్నేశ్, సిద్ధార్థ, శివ, దినేశ్, కార్తీక్, శైలజ, మౌనిక ఉన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలన
గోదావరిఖనిటౌన్: స్థానిక యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఐసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నామని ప్రిన్సిపాల్ మనోహర్ సోమవా రం తెలిపారు. అభ్యర్థులు ఐసెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మె మోలు, స్టడీ, కుల, ఆదాయం తదితర స ర్టిఫికె ట్లు, జిరాక్స్ తీసుకుని హాజరు కావాలని సూ చించారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక తమకు కేటాయించిన లాగిన్ ద్వారా ఆప్షన్‌లు ఇవ్వాల న్నారు. వెరిఫికేషన్ అధికారులు ప్రసాద్, రవి, రఘుపతి, శ్యాంప్రసాద్, జ్యోతి పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గా న్ని సోమవారం ఖరారు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా అలుగువెల్లి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా సుధాకర్, కోశాధికారిగా రాజిరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా భూమయ్య, శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. సలహాదారుగా శంకర్, కార్యవర్గ సభ్యులుగా రాధయ్య, పిల్లి రాజు, గురువయ్య, అంజయ్య, స్రవంతిని నియమించారు. వారిని పలువురు అభినందించారు.


