మూడు నెలల బియ్యం ఒకేసారి.. | - | Sakshi
Sakshi News home page

మూడు నెలల బియ్యం ఒకేసారి..

Aug 4 2026 12:29 AM | Updated on Aug 4 2026 12:29 AM

మూడు నెలల బియ్యం ఒకేసారి.. ● భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు ● గోదాముల నుంచి నేరుగా రేషన్‌ దుకాణాలకు సరఫరా

జిల్లాలో రేషన్‌కార్డులు

రకం కార్డులు యూనిట్లు

ఏఎఫ్‌ఎస్‌సీ 12,316 31,719

ఎఫ్‌ఎస్‌సీ 2,34,518 6,86,021

ఏఏపీ 147 158

మొత్తం 2,46,981 7,17,898

దశలవారీగా సరఫరా చేయండి

మూడు నెలల బియ్యం నిల్వ చేసేందుకు దుకాణాల్లో స్థలం కొరత ఉందని పలువురు రేషన్‌ డీలర్లు పౌరసరఫరాల డీఎం శ్రీనాథ్‌, డీఎస్‌వో శ్రీకాంత్‌కు మొరపెట్టుకున్నారు. వర్షాకాలం కావడంతో బియ్యం తడవకుండా భద్రపర్చాల్సి ఉందని, మూడునెలల కోటా ఒకేసారి తమకు పంపించడంతో స్థలం కొరత ఏర్పడుతోందని తెలిపారు. దశలవారీగా బియ్యం సరఫరా చేస్తే తమకు ఇబ్బందులు ఉండవని అన్నారు. గోదాముల నుంచి ఈనెల 5వ తేదీ వరకు రేషన్‌ షాపులకు బియ్యం చేరవేస్తామని అధికారులు తెలిపారు. ఐదోతేదీ అనంతరం కార్డుదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేయనున్నారు.

రేషన్‌ దుకాణాలు 410

రేషన్‌కార్డులు(లక్షల్లో) 2.46

యూనిట్లు(లక్షల్లో) 7.17

అవసరమైన బియ్యం 13,645.968

(మెట్రిక్‌ టన్నుల్లో)

పెద్దపల్లి: జిల్లాలోని రేషన్‌కార్డుదారులకు మూడునెలల సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల అధికారులు సర్వం సిద్ధం చేశారు. భారీవర్షాలతో రవాణాకు ఆటంకం కలుగుతుందని భావించిన ప్రభుత్వం.. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల కోటాను ఈనెల నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గోదాముల నుంచి దుకాణాలకు బియాన్ని వేగంగా తరలిస్తోంది. జిల్లాలో మొత్తం 410 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి.

ఈ పాస్‌ ధ్రువీకరణ తర్వాత..

లబ్ధిదారులు నిర్ణీత తేదీల్లో తమ ఈ–పాస్‌ ధ్రువీకరణ అనంతరం రేషన్‌ బియ్యాన్ని పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పంపిణీలో అవకతవకలకు చోటులేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బియ్యం కొరత, సాంకేతిక సమస్యలు తదితర ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు.

జిల్లాలోని మూడు గోదాముల ద్వారా..

జిల్లాలోని సుల్తానాబాద్‌, పెద్దపల్లి, మంథని గోదాముల ద్వారా రేషన్‌ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా కొనసాగుతోంది. మూడు నెలల బియ్యాన్ని నిల్వఉంచాల్సి రావడంతో కొందరు డీలర్లు స్థలాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా పంపిణీలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సుల్తానాబాద్‌ లో రేషన్‌ షాప్‌ల తనిఖీలు

సుల్తానాబాద్‌ జవహర్‌నగర్‌, శాస్త్రినగర్‌ రేషన్‌ షాప్‌ లను డీఎస్‌వో శ్రీనాథ్‌ తనిఖీ చేశారు. గోదాముల నుంచి రేషన్‌ దుకాణాలకు బియ్యం సక్రమంగా చేరుతున్నాయా, ఎంత మేరకు సరఫరా చేశారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రేషన్‌ బియ్యం నిల్వలు, పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి డీలర్లకు అవసరమైన సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement