నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

గోదావరిఖని: విధుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీ స్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా హెచ్చరించారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నేర సమీక్షలో పెండింగ్‌ కేసులు, నిందితుల అరెస్టు, ద ర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఆర్థిక నేరాల్లో నిబంధనల ప్రకారం ఆస్తుల జప్తు చేయాలని ఆదేశించారు. కొత్త చట్టాలపై ప్రతీపోలీస్‌ అధికారి పూర్తిఅవగాహన క లిగి ఉండాలని సూచించారు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. మంచిర్యా ల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్‌, రాంరెడ్డి, అద నపు డీసీపీ(అడ్మిన్‌) శ్రీనివాస్‌, గోదావరిఖని, పెద్దపల్లి, మంచిర్యాల, జైపూర్‌, బెల్లంపల్లి, స్పెషల్‌ బ్రాంచ్‌, ట్రాఫిక్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌, సైబర్‌క్రైం, ఏఆర్‌ ఏసీపీలు రమే శ్‌, కృష్ణ, ప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, నాగేంద్రగౌడ్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, ప్రవీ ణ్‌ కుమార్‌, శ్రీనివాస్‌రావు, రంగారెడ్డి, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ వాహనాల తనిఖీ

పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్‌స్టేషన్లకు చెందిన వాహనాల పనితీరు, నిర్వహణను సీపీ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పరిశీలించారు. నిర్ణీత వ్యవధిలో మరమ్మతు, ఇంజిన్‌ ఆయిల్‌ మార్పు, టైర్ల నిర్వహణ తదితర అంశాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement