కోల్‌సిటీ(రామగుండం): నగరంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరి చేయాలని ఎన్పీడీసీఎల్ అధికారులను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. గురువారం 7వ డివిజన్ జీఎంకా లనీలో మున్సిపల్ కమిషనర్ జె.అరుణ్‌శ్రీ, కార్పొరేటర్ వెగోలపు రమాదేవి––శ్రీనివాస్‌తో కలిసి పర్యటించారు. చేతికి అందేంత ఎత్తులోనే విద్యుత్ తీగలు ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కార్పొరేటర్, కాలనీవాసులు మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్ చేసి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం కావాలని ఆదేశించారు. వర్షాకాలానికి కంటే ముందే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసినా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్ పట్టించుకోకపోవడంతో వాటిని ఆనుకొని ఉన్న 2ఏ మోరీ, వీర్లపల్లి, రామగుండం ప్రాంతాలు జలమయమయ్యాయన్నారు. అసిస్టెంట్ కమిషనర్ సంపత్‌కుమార్, ఈఈ శాంతిస్వరూప్, టీపీఎస్ నవీన్, ఏఈలు అన్వేశ్, మనోజ్, నరేశ్, శానిటరీ ఇన్‌స్పెపక్టర్ నాగభూషణం పాల్గొన్నారు.


