రామగుండం: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో ఎంపీతోపాటు కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ సమావేశమై విన్నవించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
గోదావరిఖని: గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మ రింత బలోపేతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. బుధవారం ఎ మ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పా ర్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు మండలాల ఇన్‌చార్జిలను ప్రకటించారు. సర్ పక్రియ సాగిన తీరుపై సమీక్షించారు. జిల్లాలో ని నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
యూరియా నిల్వచేస్తే చర్యలు
కమాన్‌పూర్: అనుమతి లేకుండా యూరియా నిల్వచేస్తే చర్యలు తీసుకుంటామని డీసీపీ రాంరెడ్డి హె చ్చరించారు. ముల్కపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 127 యూరియ బస్తాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ, ఎస్‌ఆర్ ట్రేడర్స్‌లో అక్రమంగా యూరియా నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు రామగుండం టాస్క్‌ఫోర్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌ఐలు లక్ష్మ ణ్, రమేశ్, లచ్చన్న, కమాన్‌పూర్ తనిఖీ చేయగా.. యూరియా లభించిందన్నారు. వ్యవసాయాధికారి శ్రీకాంత్‌కు సమాచారం అందించగా యూరియా పరిశీలించారు. ట్రాలీ డ్రైవర్ రాజ్‌కుమార్‌ను విచారించగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల గ్రామం నుంచి యూరియా తీసుకువచ్చినట్లు తెలి పినట్లు డీసీపీ వివరించారు. డ్రైవర్‌తోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు


