కార్మికులకు అందని డ్రిల్‌బిట్లు | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు అందని డ్రిల్‌బిట్లు

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

గోదావరిఖని: రామగుండం రీజియన్‌లోని జీడీకే–11గని కార్మికులు పనిముట్లు అందక ఇబ్బంది పడుతున్నారు. పనిముట్లు, రక్షణ పరికరాలు అందించడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని అంటున్నారు. సింగరేణిలోనే అతిపెద్ద భూగర్భగని జీడీకే–11. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలుస్తోంది. ఐదు షిఫ్టుల ద్వారా విధులు నిర్వహిస్తున్న కార్మికులు సరైన పనిముట్లు లేక పనిస్థలాల్లో ఇబ్బందిపడాల్సి వస్తోంది. పైకప్పులకు హోల్‌వేసే డ్రిల్‌బిట్‌లు సకాలంలో అందడం లేదు. ఇది ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా కోల్‌కటింగ్‌ కార్మికులపై పనిభారం పెరుగుతోంది. డ్రిల్లింగ్‌ తర్వాత సపోర్టింగ్‌ కోసం ఉపయోగించే రెజిన్‌ క్యాప్సూల్స్‌ కూడా అందుబాటులో ఉండడంలేదని కార్మికులు పేర్కొంటున్నారు. హ్యాండ్‌ గ్లౌస్‌లు, డస్ట్‌మాస్కులు, నాణ్యమైన సేఫ్టీ బూట్లు సకాలంలో అందించడం లేదని వాపోతున్నారు.

మొరాయిస్తున్న కంటిన్యూస్‌ మైనర్‌

జీడీకే–11గనిలో కంటిన్యూస్‌ మైనర్‌–1కు వార్షిక మరమ్మతు సకాలంలో చేయక తరచూ మొరాయిస్తోందని కార్మికులు చెబుతన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఓవర్‌హాలింగ్‌ చేస్తే తరచూ నిలిచిపోయే అవకాశం ఉండదని అంటున్నారు.

త్వరలోనే అందుబాటులోకి

అమెరికా, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ముడిసరుకుల దిగుమతిలో ఆలస్యమైంది. ప్రస్తుతం అన్నీ సమకూర్చుకుంటున్నాం. డ్రిల్‌బిట్లు తెప్పిస్తున్నాం. రెజిన్‌ క్యాప్సూల్‌ ఈవారంలోగా అందే అవకాశం ఉంది. కంటిన్యూస్‌ మైనర్‌ యంత్రం మరమ్మతు చేయిస్తున్నాం.

– శ్రీనివాస్‌, ఏజెంట్‌, జీడీకే–11

ఇబ్బందుల్లో ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement