రామగుండం బల్దియా 7వ డివిజన్‌లో గురువారం నిర్వహించిన ‘వార్డు బాట’ కార్యక్రమం అధికారుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మేయర్ స్వామి, కమిషనర్, అధికారులు పర్యటించిన రోడ్డుపైనే ఒకవైపు బురద, మరోవైపు ప్రమాదకర మ్యాన్‌హోల్ కనిపించింది. అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్లిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ మ్యాన్‌హోల్‌ను దాటుకుని వెళ్లారే తప్ప.. వెంటనే మూత ఏర్పాటు చేయాలని, ప్రమాద సూచికలు పెట్టాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారుల తనిఖీలు కేవలం మొక్కుబడిగానే సాగుతున్నాయనడానికి ఈ దృశ్యమే నిదర్శనమని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.


