ఎన్నికల ఊసేది? | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఊసేది?

Aug 10 2026 2:04 AM | Updated on Aug 10 2026 2:04 AM

ఐదేళ్లు దాటినా

పెద్దపల్లి: జిల్లాలో గీతపారిశ్రామిక సహకార సంఘాల పరిస్థితి దయనీయంగా మారింది. 97 సంఘాలు ఉండగా, అందులో రెండింటికే పాలకవ ర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన 95 సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఐదేళ్ల క్రితమే ముగిసినా ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు.

సంఘాలు ఉన్నా పట్టించుకునే వారెవరు?

గీతకార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అనేకపన్నులు పూర్తిగా రద్దు చేసింది. దీంతో వారివృత్తిలో స్వేచ్ఛ లభించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామంతో గీత పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గాల మాట వినే పరిస్థితి తగ్గిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘాలు క్రియాశీలకంగా లేకపోవడంతో గీతకార్మికుల సమస్యలను పట్టించుకునే వ్యవస్థ కూడా బలహీనపడిందని అంటున్నారు.

ఎన్నికలకు నోటీసులు..

జిల్లాలోని 97 సొసైటీలు ఉండగా.. మంథని, రత్నా పూర్‌ సంఘాలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించా రు. మిగతా సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. వీటికోసం నోటీసులిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఎన్నికల అధికారిని నియామకం చేసి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల తేదీతోపాటు నామినేషన్‌, విత్‌డ్రాలు ఉంటాయి.

గీతకార్మికుల్లో ఆశలు..

జిల్లా కో ఆపరేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ద్వారా గీత పారిశ్రామిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించుకోవాలని ఇ టీవల ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానిక ఎక్సైజ్‌ అధికారులు ఉత్తర్వులను సంబంధిత సంఘాలకు అందజేశారు. తద్వారా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నఎన్నికలపై గీతకార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

గీత పారిశ్రామిక సహకార సంఘాలకు కార్యవర్గాల్లేవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement