క్రికెట్‌పై ఆసక్తిని ఉన్న విద్యార్థులను సరైన మార్గంలో మలచడమే మా లక్ష్యం. క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, జట్టు భావన, పట్టుదలను నేర్పిస్తాయి. సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గించి మైదానానికి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రతిభ ఉన్నవారికి మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. – సుధీశ్, క్రికెట్ కోచ్
క్రమశిక్షణ వస్తుంది
పిల్లలు ఎక్కువ సమయం సెల్‌ఫోన్లలో గడపకుండా క్రీడలు ఆడడం సంతోషంగా ఉంది. క్రికెట్ శిక్షణతో మా పిల్లల్లో శారీరక చురుకుదనం, క్రమశిక్షణ పెరుగుతున్నాయి. చదువుతోపాటు ఆటలూ సమాన ప్రాధాన్యం ఇవ్వడంతో వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. – సింఽఽఽధు, పేరెంట్
క్రికెట్ అంటే ఇష్టం
మొదట్లో ఖాళీ సమయం దొరికితే సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడేవాళ్లం. ఇప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ కోసం మైదానానికి రావడం ఆనందంగా ఉంది. కోచ్ చెప్పే సూచనలతో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. భవిష్యత్‌లో మంచి క్రికెటర్‌గా ఎదగాలనుకుంటున్నాం. – కోడెం అశ్విత్, ఎన్టీపీసీ


