జలసిరి పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

జలసిరి పనులు వేగవంతం

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

రామగిరి: జలసిరి పనుల్లో వేగం పెంచాలని, గ్రామాల్లో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ డిప్యూటీ సీఈవో సంజీవరావు సూచించారు. స్థానిక మండల ప్రజాపరిషత్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. జలసిరి, జల సంచయ్‌, జన భాగీదారి, వీబీ జీ రామ్‌జీపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌అసిస్టెంట్‌లతో సమీక్షించారు. వివిధ పనుల పురోగతి, గ్రామ సభల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతీ గ్రామంలో జల సంరక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. పనుల్లో నాణ్యతతోపాటు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బి.శైలజారాణి, సూపరింటెండెంట్‌ ఉమేశ్‌, ఏపీఎం పద్మ, జూనియర్‌ అసిస్టెంట్‌లు ఎండీ షరీఫ్‌, స్వరూప పాల్గొన్నారు.

జెడ్పీ డిప్యూటీ సీఈవో సంజీవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement