పల్లెపాలన బలోపేతం దిశగా.. | - | Sakshi
Sakshi News home page

పల్లెపాలన బలోపేతం దిశగా..

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

మంథనిరూరల్‌: గ్రామీణ ప్రాంతాల పాలనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పల్లెవాసుల సమస్యల పరిష్కారంతోపాటు, అభివృద్ధిపై అధికారుల పర్యవేక్షణ పెంచేలా మండల సర్వసభ్య సమావేశాల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పంచాయతీలకు పాలకవర్గాలు కొలువుదీరినా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో మండల సర్వసభ్య సమావేశాలు ఇప్పటి వరకు నిర్వహించలేదు. పల్లెలు ప్రగతి బాటలో పయనించేలా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాలోని 14 మండలాలు..

జిల్లాలో 14 మండలాలు ఉండగా.. 267 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గత ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. దీంతో పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరాయి. అయితే, గ్రామస్థాయిలోనే సభలు నిర్వహిస్తుండగా సమస్యలు అధికారుల దృష్టికి వెళ్లడం లేదనే వాదనలు ఉన్నా యి. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో సర్వసభ్య సమావేశాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమస్యలపై చర్చించేలా..

గ్రామాల్లో అనేక సమస్యలు అధికారుల దృష్టికి రాక పరిష్కారానికి నోచుకోవడంలేదు. వాటిని అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా మూడు నెలలకోసారి మండల స్థాయిలో సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. వీటికి డివిజన్‌, మండల స్థాయి అధి కారులు హజరు కాగా సర్పంచులు, ఎంపీటీసీలు చెప్పిన సమస్యలపై చర్చించి పరిష్కారం చూపేవా రు. దాదాపు ఎనిమిది నెలలుగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే అభిప్రాయాలున్నాయి.

ప్రత్యేక అధికారి అధ్యక్షతన..

సాధారణంగా సర్వసభ్య సమావేశాలు ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించేవారు. ఈసారి ఎంపీటీసీ ఎ న్నికలు లేక సమావేశాలు ఇంకా మొదలు కాలేదు. అధికారుల పర్యవేక్షణ లేక సమస్యలు అలాగే ఉండిపోవడం, అభివృద్ధి పనుల్లో జాప్యం కావడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

మండల సమావేశాలకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement