ఉపాధి కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పించాలి

Aug 5 2026 2:17 AM | Updated on Aug 5 2026 2:17 AM

జ్యోతినగర్‌: రామగుండంలోని ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్‌–2లో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. న్యూఢిల్లీలో మంగళవారం ‘రామగుండం కార్మికుల హక్కులు – స్థానిక యువత ఉద్యోగాల కల్పన’పై ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌సింగ్‌తో జరిగిన భేటీలో ఎంపీ వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రామగుండం మున్సిపల్‌ కార్మికులకు న్యాయమైన వేతనాలు వర్తింపజేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను అదనపు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దని ఆయన విన్నవించారు.

కలెక్టర్‌ను కలిసిన డీటీ

పెద్దపల్లి: జిల్లా సహాయ ట్రెజరీ అధికారి(ఏటీవో)గా పనిచేస్తున్న రమేశ్‌కు ఇన్‌చార్జి డీటీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఈసందర్భంగా రమేశ్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్షను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు.

గడువులోగా పూర్తిచేయాలి

ఎలిగేడు: ప్రభుత్వం నిర్దేశించిన పనులను నిర్ణీ త గడువులోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీరాములు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలిచ్చారు. భూభారతి రీసర్వే, ఎస్‌ఐఆర్‌, సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని సూ చించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ యాక న్న, డెప్యూటీ తహసీల్దార్‌ రాజేంద్రప్రసాద్‌, ఆర్‌ఐలు చంధ్రశేఖర్‌, జయలక్ష్మీ ఉన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

పెద్దపల్లి: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి పవిత్ర సూచించారు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశ డే కార్యక్రమంలో మాట్లాడారు. డాక్టర్లు లక్ష్మీభవాని, పర్హాత్‌, హెచ్‌ఈవో మురళీకృష్ణ, పీహెచ్‌ఎన్‌లు సౌంద ర్య, భారతి, రోజా, విజయలక్ష్మి పాల్గొన్నారు.

సర్కారు బడిలో సర్పంచ్‌ పిల్లల చేరిక

రామగుండం: అంతర్గాం మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ జూపాక మమత తన ఇద్దరు పిల్లలను మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. తమ పిల్లలు అద్విత్‌ను ఒకటో తరగతి, హిమాన్ష్‌ను ప్రీ ప్రైమరీలో ప్రవేశం కల్పించారు. వీరిద్దరూ గత విద్యా సంవత్సరంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుకున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ధ్యేయంగా తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్‌ మమత తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు ఆమెను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement