తిప్పలు పడుతున్నం | - | Sakshi
Sakshi News home page

తిప్పలు పడుతున్నం

Aug 2 2026 11:49 PM | Updated on Aug 2 2026 11:49 PM

అవసరాల కోసం పెద్దపల్లికి వెళ్దామంటే కొత్తపల్లి అండర్‌ బ్రిడ్జి వద్ద తిప్పలు తప్పడం లేదు. రాత్రిచీకటిగా ఉండడంతో వాహనాల వెలుతురులోనే బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సివస్తోంది. ఎంపీ చొరవ చూపి మా అవస్థలు తీర్చాలె.

– కారెంగుల శ్రీనివాస్‌, కొలనూర్‌

పట్టించుకోవడం లేదు

పెద్దపల్లి నుంచి పెద్దకల్వల, పెద్దబొంకూర్‌ మీదుగా ఓదెల, కాల్వ శ్రీరాంపూర్‌ వెళ్లేందుకు కొత్తపల్లి అండర్‌బ్రిడ్జి వద్ద నానాఇబ్బందులకు గురవుతున్నాం. ఈ విషయమై అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.

– వంగల కనుకయ్య, దస్తగిరిపల్లి

నీరు రాకుండా చూడాలి

రైల్వే అండర్‌బ్రిడ్జిలోకి పైనుంచి వర్షపునీరు రాకుండా చర్యలు తీసుకోవాలి. అధికారుల అవగాహన లోపం మాకు శాపంగా మారింది. వర్షం కురిసిందంటే వరదనీరు చేరుతోంది. ఈ మార్గంలో రాకపోకలు ఆగిపోతున్నయ్‌.

– పెర్క సంతోష్‌, కొత్తపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement