సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి..
గోదావరిఖని: ఎల్‌నీనో నేపథ్యంలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని ఆదేశించింది. వర్షాభావ పరిస్థితుల మూలంగా రై తులకు విద్యుత్ ఇబ్బంది లేకుండా నిరంతరం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఉత్పత్తి టార్గెట్ పె రిగింది. రోజూ 28 నుంచి 32 రేకుల నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాలని సంస్థ సీఎండీ అన్ని ఏరియాల జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు.
ఓసీపీల్లో తగ్గిన ఉత్పత్తి
వర్షాల కారణంగా ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. అయినా ముందస్తు జాగ్రత్తలతో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేలా చూడాలని అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గినా భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ థర్మల్ కేంద్రాలకు 75 నుంచి 80 శాతం బొగ్గును సింగరేణి అందిస్తోంది. ఉత్పత్తికి అనుగుణంగా అన్ని ఓసీపీల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు భవిష్యత్తులో 70 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలని, 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.
ఓసీపీల్లో 93శాతం ఉత్పత్తి
సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఓసీపీల్లో ఈనెల 10 నాటికి 18.21మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 16.87మిలియన్ టన్నుల బొగ్గు సాధించి లక్ష్యాల్లో 93శాతం చేరుకున్నాయి. వర్షాకాలం తర్వాత లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి చేసేలా యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది.
80 శాతం బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే


