కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలకేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో పీఎం కుసుము పథకంలో చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్‌లో ఈనెల 10 వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా పనులు పూర్తి చేియాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండలకేంద్రంలోని పాండవుల గుట్టపై నిర్మిస్తున్న సోలార్ ప్లాంట్‌ను గురువారం కలెక్టర్ సందర్శించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని ప్రక్రియలు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ రాపెల్లి రాముడు, పీఏసీఎస్ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సీఈవో కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల అంచనాలు సిద్ధం చేయాలి
ముత్తారం(మంథని): గ్రామాల్లో అభివృద్ధి పనులు గుర్తించి అంచనాలు త్వరగా సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గురువారం ముత్తారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయిలో పని చేస్తూ ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. వీబీజీరామ్‌జీ పథకంలో అభివృద్ధి పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పలువురు సర్పంచులు విన్నవించిన సమస్యలు విని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎంఈవో హరిప్రసాద్, మండల సర్పంచుల కన్వీనర్ బియ్యని శివకుమార్, సర్పంచులు పాల్గొన్నారు.


