గోదావరిఖని: గంజాయి విక్రయాలపై డేగకన్ను వేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో నమోదైన 81 ఎన్‌డీపీఎస్ కేసుల్లో నిందితుల నుంచి స్వా ధీనం చేసుకున్న రూ.17.09 లక్షల విలువైన 40.173 కిలోల గంజాయిని బుధవారం ధ్వంసం చేసినట్లు సీపీ తెలిపారు. ఎండు గంజాయితోపాటు 26 మొక్కలనూ న్యాయస్థానం అనుమతితో ధ్వంసం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, జైపూర్, స్పెషల్‌బ్రాంచ్ ఏసీపీలు రమేశ్, వెంకటేశ్వర్లు, నాగేంద్రగౌడ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అనిల్, ఎస్‌ఐ వినీత తదితరులు పాల్గొన్నారు.
అధికారుల తీరు మారాలి
పెద్దపల్లి: పోలీస్, రెవెన్యూ అధికారు లు ఫోన్లకు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని తన నివా సంలో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. ప్రజలు అత్యవసర సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్‌చేస్తే స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. అధికారుల తీరు మారాలని కోరారు. పట్టణంలోని పురాతన శివాలయంలో మైక్‌లు తొ లగించాలని ఓ కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, సుప్రభాతం, భక్తిగీతాలు, శివనామస్మరణ వంటి కార్యక్రమాలు తరాలుగా కొనసాగుతున్నాయని, వీటిపై అభ్యంతరం వ్యక్తం చేయడం సరికాదన్నారు. నాయకులు పల్లె సదానందం, శిలావేరు ఓదెలు, భూషణ్, వేణి శ్రీనివాస్‌గౌడ్, జంగ చక్రధర్‌రెడ్డి, పర్శ సమయ్య, మీస అర్జున్‌రావు, రాంసింగ్, పర్వతాలు పాల్గొన్నారు.


