సుల్తానాబాద్ రూరల్: వాలీబాల్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా కనుకుల గ్రా మానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు పసెడ్ల రమేశ్‌ను నియమించినట్లు అసోసియేషన్ ప్రధానకార్యదర్శి కన్న రమేశ్ తెలిపారు. పసెడ్ల రమేశ్‌ను అభినందిస్తూ సోమవారం అసోసియేషన్ నేతృత్వంలో శాలువా కప్పి సన్మానించారు. అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కస్తూరి లక్ష్మారెడ్డి, నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్, తిరుమల్‌రావు, పడాల అజయ్‌గౌడ్, విజ్ఞాన్‌రావు, బుచ్చిరెడ్డి, మహ్మద్‌రషీద్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చైతన్యయాత్ర
గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 9 నుంచి సింగరే ణి వ్యాప్తంగా చైతన్యయాత్ర నిర్వహిస్తు న్నట్లు టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు, నిల్వ లు సింగరేణికే చెందాలని కోరారు. సంస్థకు రావాల్సిన సుమారు రూ.60వేల కోట్లు వెంటనే కేటాయించాలన్నారు. కాగితాల్లో లాభా లు కనిపిస్తున్నా.. ఆర్థిక వనరులు లేక ఉద్యోగులకు జీతాల చెల్లింపులకు కూడా ఇబ్బందు లు ఎదురవుతున్నాయన్నారు. కార్మిక వర్గంలో చైతన్యం నింపేందుకు, సింగరేణి పరిరక్షణకు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నాయకులు మాదాసి రాంమూర్తి, నూ నె కొమరయ్య, చెల్పూరి సతీశ్, దూట శేషగిరి, వాసర్ల జోసెఫ్, రొడ్డ సంపత్, మాసాడి సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.
కాలువలో పడి యువకుడి మృతి
మెట్‌పల్లి: ఎస్సారెస్పీ కాలువలో షేర గంగ(30)ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన గంగ బట్టలు ఉతికేందుకు మెట్ల మార్గం ద్వారా కాలువలోకి దిగాడు. అక్కడ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు బయటకు తీయగా.. అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
తిమ్మాపూర్: మన్నెంపల్లిలో ఓ వ్యక్తి ఆత్మహ త్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మెరుగు వెంకన్న(60) గోదావరిఖనిలో మిర్చిబండి న డుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నిరో జుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అనా రోగ్యంతో బాధపడుతున్న వెంకన్న మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు. సోమవారం ఉదయం ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ‘ఇక సెలవు మీ వెంకన్న‘ అంటూ రాసిన చిన్నచిట్టి ఘటనా స్థలంలో దొరికింది.


