దాని గురించి పట్టించుకోను

shruti hassan Tied Rakhi To Her Mother - Sakshi

తమిళసినిమా: దాని గురించి పట్టించుకోను అంటోంది నటి శ్రుతీహాసన్‌. తనకు నచ్చింది, మనసుకు అనిపించింది చేసుకుపోయే నటి శ్రుతీహాసన్‌. కమలహాసన్, సారికల నటవారసత్వాన్ని అనుకోకుండానే భుజాల మీద మోస్తున్న శ్రుతీహాసన్‌ క్రేజీ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. ముంబైలో ఉంటే తల్లి సారికతో, చెన్నైలో ఉంటే తండ్రి కమలహాసన్‌తోనూ తన అనుబంధాన్ని పంచుకునే శ్రుతీహాసన్‌ ప్రియుడిని కలవాలంటే లండన్‌కు వెళ్లొస్తుంటుంది. అలా సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన ఈ బ్యూటీ తనకు తాను తీసుకున్న చిన్న గ్యాప్‌ తరువాత తాజాగా ఒక హింది చిత్రంలో నటిస్తోంది. ఇక పోతే రక్షాబంధన్‌ పండుగ అంటే అన్నాచెల్లెల్ల అనుబంధానికి చిహ్నం. ఆదివారం ఈ వేడుకను అందరూ సంతోషంగా జరుపుకున్నారు. నటి శ్రుతీహాసన్‌ కూడా రాఖీ పండుగను జరుపుకుంది. అదేమిటీ శ్రుతీహాసన్‌కు సోదరులు లేరు కదా! అనే సందేహం కలుగుతోందా? యువతులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీసులు అందుకుంటే నటి శ్రుతీహాసన్‌ కొంచెం వ్యత్యాసంగా తన తల్లికి రాఖీ కట్టి ఆశీసులు అందుకుంది.

ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. ఆ సందర్భంగా శ్రుతీహాసన్‌ పేర్కొంటూ అమ్మ సారికతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మేమిద్ద రం కలిసి ఒక చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాం. నాన్నతో కలిసి ఇప్పటికే పని చేశాను. అయితే అమ్మతో కలిసి నటించాలని ఆశగా ఉంది. అమ్మా,నాన్నలు నటనలో ప్రతి భావంతులు కావడంతో నేను నటిగా ప్రతిభను చాటుకోవాలన్న ఒత్తిడి లేదు. ఇది నా జీవితం. అమ్మా నాన్న నాలుగేళ్ల వయసు నుంచే నటిస్తున్నారు. వారితో నేను పోటీ పడలేను. నా తల్లిదండ్రులతో నన్ను పోల్చుకుంటారన్న విషయం తెలుసు. అదంతా నేను పట్టించుకోను. అయితే నేను అమ్మానాన్నలు గర్వించేలా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా ను. అందుకు నా కఠిన శ్రమ చూసి వారు కచ్చి తంగా గర్వపడతారు. నాకూ అదే ముఖ్యం. సినీ పరిశ్రమ చాలా సహనాన్ని నేర్పుతుం ది. మరో విషయం ఏమిటంటే నేను కావా లని కోరుకుని నటిని కాలేదు. ఆ విధంగా నేను అదృష్టవంతురాలిని.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top