Most Expensive Rakhi: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో.. | Raksha Bandhan 2022: India's Most Expensive Rakhi Costs Rs. 5 Lakhs | Sakshi
Sakshi News home page

Most Expensive Rakhi Surat: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో..

Aug 12 2022 3:15 AM | Updated on Aug 12 2022 8:51 AM

Raksha Bandhan 2022: India's Most Expensive Rakhi Costs Rs. 5 Lakhs - Sakshi

ఇప్పుడెక్కడ చూసినా రాఖీ ముచ్చటే. గుజరాత్‌లోని సూరత్‌ మాత్రం ఇంకాస్త స్పెషల్‌. ఎందుకంటే... అక్కడంతా ఈ ఫొటోలో ఉన్న రాఖీ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది? అంటే. దాని విలువ. ఆ రాఖీ ఖరీదు ఐదు లక్షలు. బంగారంతో డిజైన్‌ చేసిన రాఖీ మధ్యలో వజ్రాలను పొదిగారు. ఆ వజ్రాలపై మళ్లీ ‘ఓం’గుర్తును పొందుపరిచారు. ప్రతి ఏటా వివిధ రకాల బంగారు, వెండి, ప్లాటినమ్‌ రాఖీలతో ఆకట్టుకునే ఆ షాప్‌ ఈసారి... వజ్రాలు పొదిగిన రాఖీని తయారు చేసింది.

సాధారణంగా రాఖీని రెండు, మూడు రోజుల తరువాత తీసేస్తారు. కానీ ఈ రాఖీని ఎప్పుడైనా ఆభరణంగా కూడా ధరించే వీలుందంటున్నాడు నగల షాప్‌ యజమాని దీపక్‌ భాయ్‌ చోక్సీ. అంతవిలువైన రాఖీని మీ అక్కనో, చెల్లెనో కడితే బాగుండేది అనుకుంటున్నారా.. అయితే అంతకంటే విలువైన గిఫ్ట్‌ను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement