రాఖీ విషాదం, అన్నాచెల్లెలు మృతి

సాక్షి, వనపర్తి: రాఖీ పండుగరోజు జిల్లాలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామం వద్ద విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సుఢీకొట్టిన ఘటనలో అన్నాచెల్లెలు మృత్యువాత పడ్డారు. మరో చెల్లెలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతులు తూంకుంటకు చెందిన సుధాకర్, నందినిగా తెలిసింది. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పెద్దదగడకు వెళ్లి సోదరుడికి రాఖీకట్టి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
(మృత్యుపాశమైన బావి)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి