రాఖీ స్పెషల్‌ : ఆ స్వీట్‌ ధర ఎంతంటే..

Gold Sweets Sold At Sweet Shop In Surat Ahead of Rakhi - Sakshi

అహ్మదాబాద్‌ : రక్షా బంధన్‌ పండుగకు ముందు గుజరాత్‌లోని సూరత్‌లో ఓ స్వీట్‌ షాప్‌లో బంగారు పూతతో చేసిన డ్రై ఫ్రూట్‌ స్వీట్‌ను కిలో రూ 9000కు విక్రయిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా బంగారు పూతతో చేసిన స్వీట్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. 24 క్యారట్స్‌ మిఠాయి మేజిక్‌ పేరుతో ఉన్న ఈ షాప్‌లో 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారు పూతతో పలు వెరైటీ స్వీట్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

గోల్డ్‌ స్వీట్లకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని షాప్‌ యజమాని బ్రిజ్‌ మిఠాయివాలా చెప్పకొచ్చారు. బంగారు పూతతో చేసిన ఆహారంతో పలు ఆరోగ్య ప్రయోజనాలుండటంతో ఈ స్వీట్లను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ నెల 26న రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top