Raksha Bandhan 2024: ఎక్కడ చూసినా మోదీ రాఖీలే.. | Raksha Bandhan 2024: PM Narendra Modi Rakhi In Market | Sakshi
Sakshi News home page

Raksha Bandhan 2024: ఎక్కడ చూసినా మోదీ రాఖీలే..

Aug 12 2024 8:05 AM | Updated on Aug 12 2024 9:08 AM

Raksha Bandhan 2024: PM Narendra Modi Rakhi In Market

అనుబంధాలను పంచుకునే పండుగ రక్షా బంధన్. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల అన్యోన్యతకు చిహ్నం ఈ పండుగ. రాఖీ నాడు సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, ఆశీర్వాదం పొందుతారు. ఈసారి రక్షాబంధన్ ఆగస్టు 19న వచ్చింది.

దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విక్రయాల కోసం రాఖీలను అందుబాటులో ఉంచారు. ఈసారి పిల్లల కోసం వెరైటీ రాఖీలు అనేకం కనిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చిన్నారులు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వీటన్నింటి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే ఛోటా భీమ్, హల్క్, డోరేమాన్, సూపర్‌మాన్‌, షించెన్, మోటు-పత్లు లాంటి అనేక కార్టూన్ పాత్రలతో కూడిన రాఖీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన దుకాణదారు భాస్కర్ సాహ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున మార్కెట్‌లోకి వివిధ రకాల రాఖీలను తీసుకువస్తుంటామని తెలిపారు. ప్రస్తుతం  ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన రాఖీకి అమితమైన డిమాండ్‌ ఏర్పడిందని, ఎక్కడ చూసినా ఇటువంటి రాఖీలు కనిపిస్తున్నాయని తెలిపారు. మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.50 వరకు ఖరీదు కలిగిన రాఖీలు విరివిగా విక్రయమవుతున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement