రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు | Rakhi Occasion:Rashtraniki Raksha Jagananna Displayed By School Children | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి రక్ష జగనన్న.. సీఎం జగన్‌పై ప్రేమను చాటుకున్న విద్యార్థులు

Published Wed, Aug 30 2023 5:40 PM | Last Updated on Thu, Aug 31 2023 7:48 AM

Rakhi Occasion:Rashtraniki Raksha Jagananna Displayed By School Children - Sakshi

అమరావతి: రక్షాబంధన్‌(రాఖీ పర్వదినం)ను పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులు విన్నూత్న శైలిలో ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తమకున్న ప్రేమ, కృతజ్ఞతను చాటుకోవడానికి రక్షాబంధన్‌ పండుగను వేదికగా చేసుకున్నారు విద్యార్థులు.

‘రాష్ట్రానికి రక్ష జగనన్న’ అంటూ మానవ గొలుసుగా ఏర్పడి హృదయపూర్వకమైన సంజ్ఞను ప్రదర్శించారు. సీఎం జగన్‌ను మేనమామగా పిలుచుకునే విద్యార్థులు.. ఆయనపై అమితమైన విశ్వాసంతో ఉన్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విద్యాకుసుమాలు జగన్‌లో ఓ సంరక్షకుడిని చూసుకుంటున్నారు.  

ప్రకాశవంతమైన రేపటికోసం సీఎం జగన్‌పైనే నమ్మకం ఉంచిన విద్యార్థులు..  అందుకు బదులుగా రాష్ట్రానికి రక్ష జగనన్న అంటూ  ఇలా తమ ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు. సీఎం జగన్‌,  విద్యార్ధుల మధ్య ఉన్న బంధానికి ఇదొక ప్రతీకగా చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement