పాఠశాలకు వెళ్తూ వాగులో కొట్టుకుపోయిన టీచర్‌ | Teacher Washed Away While Crossing Swollen Stream In Karlapodar, Villagers Rescue Her In Time, Check Out Details | Sakshi
Sakshi News home page

పాఠశాలకు వెళ్తూ వాగులో కొట్టుకుపోయిన టీచర్‌

Aug 11 2026 12:28 PM | Updated on Aug 11 2026 1:00 PM

Teacher Washed Away While Crossing Stream Saved by Villagers in Karlapodar

వాగులోంచి ఉపాధ్యాయురాలిని బయటకు తీసుకొస్తున్న కర్లపొదర్‌ గ్రామస్తులు

అల్లూరి సీతారామరాజు జిల్లా : పాఠశాలకు వెళ్లేందుకు వాగు దాటే క్రమంలో ఓ ఉపాధ్యాయురాలు ప్రవాహంలో కొట్టుకుపోయారు. కర్లపొదర్‌ గ్రామస్తులు కాపాడడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎం.మణి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లే క్రమంలో కర్లపొదర్‌ వద్ద ఉన్న వాగును దాటుతున్న సమయంలో లోతును అంచనా వేయలేక, నీటి ప్రవాహం  ఉధృతంగా ఉండడంతో కొంతదూరం కొట్టుకుపోయా రు. 

అదృష్టవశాత్తూ చేతికి చెట్టుకొమ్మ తగలడంతో దానిని పట్టుకుని  గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కర్లపొదర్‌ గ్రామస్తులు పరుగుపరు గున సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను కాపాడి, వాగు నుంచి బయటకు తీసుకువచ్చారు.ఈ విష యం తెలుసుకున్న ఎంఈవో–2 త్రినాథరావు, సీఆర్‌పీ ఈశ్వర్‌ కర్లపోదర్‌ గ్రామానికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశా రు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా లబ్బూరు ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షలు నిర్వహించి,ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.  కర్లపోదర్‌ వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలని  లక్ష్మీపురం మాజీ సర్పంచ్‌ కొర్రా త్రినాథ్, కర్లపోదర్‌ గ్రామస్తులు కోరారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement