ఇరుముడిలో బేబీ నక్షత్ర.. ఇంత కన్నీటి కథ ఉందా? | Director Siva Nirvana Reveals Baby Nakshatra Heartbreaking Struggles, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Irumudi Movie: ఇరుముడిలో బేబీ నక్షత్ర.. ఇంత కన్నీటి కథ ఉందా?

Aug 24 2026 9:46 PM | Updated on Aug 25 2026 11:31 AM

Baby Nakshatra Struggles revealed by DIrumudi irector Siva Niravana

రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం  రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్‌ సలబ్రేషన్స్ చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఇరుముడి టీమ్ అంతా హాజరైంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్న బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తండ్రి  లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించిందని  శివ నిర్వాణ వెల్లడించారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే.. ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యానికి నిజంగా అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా బేబీ నక్షత్ర తల్లిని స్టేజ్‌పైకి తీసుకొచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తన కూతురిని సపోర్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణకు నక్షత్ర తల్లి ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement