ఓటీటీలో తెలుగులోనూ 'హనుమాన్ అన్ష్'.. ప్రకటన | Hanuman Ansh OTT Release Date Telugu Latest | Sakshi
Sakshi News home page

Hanuman Ansh OTT: రెండు ఓటీటీల్లో లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా

Nov 26 2026 2:12 AM | Updated on Nov 26 2026 2:12 AM

Hanuman Ansh OTT Release Date Telugu Latest

ఈ ఏడాది రిలీజై అద్భుతమైన విజయం సాధించిన సినిమాల్లో 'హనుమాన్ అన్ష్' కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. ఎందుకంటే రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసి విడుదల చేస్తే ఏకంగా రూ.300-400 కోట్ల కలెక్షన్లు సాధించి ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా అలరించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

ఆగస్టు 07న హిందీలో రిలీజైన ఈ సినిమాని తొలుత జనాలు పెద్దగా చూడలేదు. తర్వాత వారాల్లో మౌత్ టాక్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. అలా వందల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. హిందీలో అలరించింది కదా అని తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ ఫ్లాప్ అయింది.

అసలు విషయానికొస్తే ఈ శుక్రవారం(నవంబర్ 27) నుంచి సోనీ లివ్ ఓటీటీల్లోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అయితే ఇది హిందీ వెర్షన్ మాత్రమే కాగా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గుజరాతీ వెర్షన్లు.. ఈ ఆదివారం(నవంబర్ 29) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement