ఓటీటీకి లేటేస్ట్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Vishnu Vishal Latest Movie Gatta Kusthi2 Ott Streaming date locked | Sakshi
Sakshi News home page

Gatta Kusthi 2 Ott: ఓటీటీకి స్పోర్ట్స్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jul 29 2026 5:27 AM | Updated on Jul 29 2026 5:27 AM

Vishnu Vishal Latest Movie Gatta Kusthi2 Ott Streaming date locked

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం గట్ట కుస్తీ-2. ఈ సినిమాకు చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్ వద్ద సినీ ప్రియులను మెప్పించింది. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, యోగి బాబు, కరుణాస్ కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ నెల 31 నుంచే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన మట్టి కుస్తీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదల చేశారు. అయితే ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement