అల్లు అర్జున్‌ మూవీ నేనే చేయాల్సింది.. కానీ: సుమంత్ | Tollywood Hero Sumanth Shares His tollywood career missed Movies | Sakshi
Sakshi News home page

Sumanth: 'అల్లు అర్జున్‌ సూపర్ హిట్ మూవీ .. నేనే చేయాల్సింది'

Jul 29 2026 1:30 AM | Updated on Jul 29 2026 1:30 AM

Tollywood Hero Sumanth Shares His tollywood career missed Movies

సుమంత్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారాయన. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుమంత్.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలు మిస్ చేసుకున్నానని వెల్లడించారు.

2000లో వచ్చిన సూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి చిత్రం దర్శకుడు కె విజయభాస్కర్ మొదట నన్నే సంప్రదించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదరలేదని తెలిపారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు స్క్రిప్ట్‌ కూడా తానే మొదటి విన్నానని తెలిపారు. కానీ నేను చేసి ఉంటే అంత భారీ హిట్ కొట్టేది కాదన్నారు. అల్లు అర్జున్‌కే దేశముదురు సెట్ అయిందని పేర్కొన్నారు.

కాగా.. న్యూటన్ థర్డ్ లా మూవీకి రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించగా.. కె.హరీశ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, కార్తీక్‌ రత్నం, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జులై  31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement