రణ్‌బీర్ కపూర్ రామాయణ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే? | Ranbir Kapoor Ramayana Movie Trailer date and time out now | Sakshi
Sakshi News home page

Ramayana Movie: రామాయణ ట్రైలర్.. ఎట్టకేలకు ముహుర్తం ఫిక్స్

Jul 29 2026 12:45 AM | Updated on Jul 29 2026 12:45 AM

Ranbir Kapoor Ramayana Movie Trailer date and time out now

రణ్‌బీర్ కపూర్‌, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ రామాయణ. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యశ్‌ నటిస్తున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్‌ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. ఈ మూవీకి హాలీవుడ్‌ సంగీత దర్శకుడు  హన్స్  జిమ్మెర్ పనిచేస్తున్నారు. ఆయన గ్లాడియేటర్‌,  ఇంటర్‌ స్టెల్లర్‌, ది లయన్‌ కింగ్‌, డ్యూన్‌ వంటి టాప్‌ చిత్రాలకు సంగీతం అందించారు.

అయితే ఈ మూవీ ట్రైలర్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. రామాయణ ట్రైలర్‌ టైమ్ అండ్‌ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల 24 రిలీజ్‌ చేస్తామని వాయిదా వేసిన మేకర్స్ తాజాగా డేట్‌తో టైమ్ ప్రకటించారు. ఈ నెల 30న సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎంతో పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ఈ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement