సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ సునీల్ ఆనంద్ మరణించారు. లండన్‌లో ఉన్న ఆయనకు గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని సునీల్ ఆనంద్ మేనకోడలు గీనా నారంగ్ ధృవీకరించారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి ప్రైవసీ కల్పించాలని ఆమె కోరారు.
కాగా.. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో దేవ్ ఆనంద్, నటి కల్పనా కార్తీక్‌లకు సునీల్ ఆనంద్ జన్మించారు. ఆ తర్వాత అమెరికాలో తన చదువు పూర్తి చేసుకున్నారు. 1984లో తన తండ్రితో కలిసి 'ఆనంద్ ఔర్ ఆనంద్' చిత్రంతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. దేవ్ ఆనంద్ కూడా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆ తర్వాత సునీల్ 'కార్ థీఫ్', 'మై తేరే లియే' అనే మరో రెండు చిత్రాల్లో నటించారు. రెండో చిత్రంలో ఆయన మీనాక్షి శేషాద్రి సరసన నటించారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి.


