ఒకప్పుడు వినాయక చవితి అంటే పద్ధతిగా పందిరి వేసి జరుపుకొనేవారు. కానీ గత కొన్నేళ్లలో సినిమా హీరోలు, క్రికెటర్లని పోలినట్లు ఉండే వినాయక ప్రతిమలు తయారు చేస్తున్నారు. గతేడాది 'పుష్ప' తరహా బొమ్మలు కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈసారి అలాంటిదేం లేనప్పటికీ తమిళనాడులో మాత్రం వినాయక చవితిలోనూ సీఎం విజయ్ మేనియానే నడుస్తోంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారంటే?)
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి పండగ రావడంతో విజయ్ సైకిల్ తొక్కిన, కోటు వేసుకుని గడ్డం కింద చేయి పెట్టినట్లు, అలానే గిల్లీ చిత్రంలో కబడ్డీ ఆడుతున్న విజయ్ తరహా వినాయకుడి బొమ్మలు తమిళనాడులో కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: త్రిష రాగానే ముఖం పక్కకు తిప్పుకొన్న విజయ్.. వీడియో)


