వినసొంపుగా 'రామాయణ' తొలి పాట.. వీడియో రిలీజ్ | Ramayana Movie Jai Jai Ram Song Latest | Sakshi
Sakshi News home page

Ramayana Movie Song: చూడచక్కగా రాముడు-సీత.. 'రామాయణ' పాట విన్నారా?

Sep 14 2026 11:53 AM | Updated on Sep 14 2026 12:28 PM

Ramayana Movie Jai Jai Ram Song Latest

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా నటించిన భారీ బడ్జెట్ డివోషనల్ సినిమా 'రామాయణ'. దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దాదాపు నెల క్రితం ట్రైలర్ వదిలారు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా 'జై జై రామ్' అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. ఇది వినసొంపుగా ఉంటూ అలరిస్తోంది.

సీత కోసం స్వయంవరంలో పాల్గొనడం, ఇద్దరి పరిణయం తదితర సన్నివేశాలు ఈ గీతంలో చూపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ పాటని శ్రేయా ఘోషల్, ఆర్జిత్ సింగ్ పాడారు. నితీష్ తివారీ ఈ చిత్రానికి దర్శకుడు. రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి చేయగా.. రావణుడిగా యష్ కనిపించబోతున్నాడు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ లాంటి స్టార్ దర్శనమివ్వబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement