​బ్రిక్స్ వేదిక: పాటతో అదరగొట్టిన మలేషియా ప్రధాని | Malaysian PM Anwar Ibrahim Sings Kishore Kumar Classic In New Delhi | Sakshi
Sakshi News home page

​బ్రిక్స్ వేదిక: పాటతో అదరగొట్టిన మలేషియా ప్రధాని

Sep 13 2026 10:40 AM | Updated on Sep 13 2026 10:59 AM

Malaysian PM Anwar Ibrahim Sings Kishore Kumar Classic In New Delhi

సాధారణంగా శిఖరాగ్ర సమావేశాలు అంటే.. అధికారిక ప్రసంగాలు, తీవ్రమైన చర్చలే ఉంటాయి. బ్రిక్స్ వేదికగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తన గానంతో సందడి చేశారు. నిన్న(శనివారం) సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అందరినీ అలరించేలా ఓ క్లాసిక్ బాలీవుడ్ పాటను పాడారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన.. డిన్నర్ కార్యక్రమంలో 1965 నాటి తీన్ దేవియాన్ సినిమాలోని కిషోర్ కుమార్ అమర ప్రేమ గీతం "ఖ్వాబ్ హో తుమ్ యా కోయ్ హకీకత్" పాటను పాడి ఉర్రూతలూగించారు.

మజ్రూహ్ సుల్తాన్‌పురి రాసిన ఈ పాటను ఆలపించిన ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. సభలోని అందరి దృష్టిని ఆకర్షించారు. దౌత్యం, రాజకీయాలతో నిండిన ఆ రాత్రిని వినోదంగా మార్చారు. అన్వర్ ఇబ్రహీం తన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పాటను పాడేందుకు అనుమతి కోరుతున్నట్లు క్యాప్షన్ రాశారు. ఈ వీడియో వైరల్‌ కాగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "సర్, మీరు చాలా బాగా పాడారు; భారత్‌లో మీకు అద్భుతమైన సమయం గడిచిందని ఆశిస్తున్నాను’’ అంటూ ఓ యూజర్ కామెంట్ సెక్షన్‌లో రాశారు.

"వావ్, మిస్టర్ అన్వర్ ఇంత మధురంగా పాడగలరని నాకు తెలియదు. చాలా బాగుంది. మలేషియాలో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడి నుంచి బోలెడన్ని ప్రేమపూర్వక శుభాకాంక్షలు అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. భారతీయ పాటలపై మలేషియా ప్రధాని తన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. భారతీయ సినిమా, సంగీతం పట్ల అభిమానాన్ని గతంలో కూడా పంచుకున్నారు. భారత్‌లో పర్యటించిన సమయంలోనూ ఆయన మీడియా సమావేశంలో సరిగ్గా ఇదే కిషోర్ కుమార్ పాటనూ, ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖేష్ క్లాసిక్ పాట "దోస్త్ దోస్త్ నా రహా"ను కూడా ఆలపించారు.

కాగా, బిక్స్‌ సదస్సులో మలేషియా ప్రధాని.. ప్రపంచ సమస్యలు, ఆర్థిక సంబంధాలు, వాణిజ్య పద్ధతులపై చర్చించారు. భారత్-మలేషియా దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో డిజిటల్ టెక్నాలజీ, పర్యాటకం వంటి రంగాలలో సహకారాన్ని మరింత విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అలాగే ప్రధాని మోదీ ప్రపంచ స్థాయి గుర్తింపును కొనియాడారు.

ఇదీ చదవండి: లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement