ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరీ ఇంత ఘోరమా? | Viswanath And Sons And Magudam Movie OTT Trolls | Sakshi
Sakshi News home page

OTT Movies: సూర్య, విశాల్ సినిమాలపై దారుణమైన ట్రోలింగ్

Sep 14 2026 2:26 PM | Updated on Sep 14 2026 2:48 PM

Viswanath And Sons And Magudam Movie OTT Trolls

కొన్ని సినిమాలు థియేటర్లలో బాగా ఆడుతాయి. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అవే చిత్రాలకు రెస్పాన్స్ మరోలా ఉంటుంది. ఇది చాలా మూవీస్ విషయంలో జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం 'చెన్నై లవ్ స్టోరీ'కి ఇలాంటి అనుభవమే ఎదురవగా.. ఇప్పుడీ లిస్టులో విశ్వనాథ్ అండ్ సన్స్, మకుటం వచ్చి చేరాయి.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)

సూర్య హీరోగా చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా గత నెలలో థియేటర్లలో రిలీజైంది. తెలుగులో హిట్ కాగా తమిళంలో పెద్దగా కలెక్షన్స్ రాలేదు. ఓవరాల్‌గా బాగానే ఉందనిపించుకుంది. కానీ వారం క్రితం ఓటీటీలో రిలీజైన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయింది. అసలు ఈ మూవీ హిట్ ఎలా అయిందా అని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. మమిత బైజు సీన్స్ తప్పితే మిగతావి ఏమంత ఇంట్రెస్టింగ్‌గా లేవు కదా అని మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో ప్రింట్ క్వాలిటీ కూడా భయంకరంగా ఉందని వీడియోలని ఫ్రూప్స్‌గా పెడుతున్నారు.

సూర్య సినిమా విషయంలో ఇలా ఉంటే.. విశాల్ 'మకుటం' చిత్రానికి అయితే ఓటీటీలోకి వచ్చిన పోస్ట్‌మార్టం చేస్తున్నారు. పావుగంట కంటే ఎక్కువ చూడలేకపోయామని ఒకరు.. అసలు ఈ మూవీ ఎలా తీశార్రా బాబు అని మరొకరు పోస్టులు పెడుతున్నారు. ఈ చిత్ర మేకింగ్ వీడియోల్లో విశాల్ ప్రవర్తనకు సంబంధించిన బిట్స్ కట్ చేసి సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు.

గత కొన్నిరోజుల నుంచి ట్విటర్, ఇన్ స్టాలో ఈ రెండు సినిమాల గురించే చాలా చర్చ జరుగుతోంది. ఇదంతా చూసిన చాలామంది సినిమాలు నిజంగా బాగోలేవా? లేదంటే పనిగట్టుకుని నెటిజన్లు వీటిని ట్రోల్ చేస్తున్నారా? అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఓటీటీ, సోషల్ మీడియా జమానా పెరిగిన తర్వాత మూవీస్ విషయంలో శూలశోధన ఎక్కువైంది. రాబోయే రోజుల్లో ఈ ట్రోలింగ్ బారిన ఇంకెన్ని పెద్ద సినిమాలు పడతాయో ఏంటో?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement