భార్యను రెడీ చేయించేందుకు అమితాబ్‌కీ తప్పని తిప్పలు! | Amitabh Bachchan Reveals His Clever Trick to Get Wife Jaya Ready on Time | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan : జయా బచ్చన్‌ విషయంలో అమితాబ్‌ భలే ట్రిక్‌

Sep 14 2026 5:14 PM | Updated on Sep 14 2026 5:19 PM

Amitabh Bachchan Reveals His Clever Trick to Get Wife Jaya Ready on Time

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి-18’ కార్యక్రమంలో తన భార్య, నటి జయా బచ్చన్‌ గురించి ఓ సరదా విషయాన్ని వెల్లడించారు. జయా బచ్చన్‌ ఈవెంట్లకు రెడీ అవ్వడానికి సమయం తీసుకుంటారని చెప్పిన అమితాబ్‌.. ఆమెను సమయానికి సిద్ధం చేసేందుకు తాను ఓ చిన్న ట్రిక్‌ ఉపయోగిస్తానని తెలిపారు.

ఓ కంటెస్టెంట్‌.. ‘‘మీరు ఎప్పుడైనా జయాజీ రెడీ అయ్యే వరకు ఈవెంట్‌కు వెళ్లేందుకు ఎదురుచూశారా?’’ అని అమితాబ్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు.

టైమ్‌ విషయంలో బిగ్‌బీ ప్లాన్‌ ఇదే..
‘సాయంత్రం 6 గంటలకు పెళ్లి కార్యక్రమం ఉందనుకోండి.. జయా బచ్చన్‌కు అసలు సమయం చెప్పకుండా నేను 5 గంటలకు బరాత్‌ వస్తుందని చెబుతాను. దాంతో ఆమె 3.30–4 గంటల నుంచే మేకప్‌, రెడీ అవ్వడం మొదలుపెడతారు. చివరికి మేము సమయానికి కార్యక్రమానికి చేరుకుంటాం’ అని అమితాబ్‌ సరదాగా చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం

ఆలస్యంగా ఇంటికి వెళ్తే కూడా..
జయా బచ్చన్‌ గురించి అమితాబ్‌ గతంలోనూ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. షూటింగ్‌ కారణంగా తాను ఆలస్యంగా ఇంటికి వస్తే జయా అసంతృప్తి చెందుతారని చెప్పారు. అందుకే తాను ఆలస్యంగా వస్తున్నప్పుడు ముందుగానే కుటుంబ సభ్యుల వాట్సాప్‌ గ్రూప్‌లో సమాచారం ఇస్తానని తెలిపారు. షూటింగ్‌ ఉందని, ఇంటికి ఆలస్యంగా వస్తానని ముందే చెప్పడంతో తన కోసం భోజనం కోసం ఎదురుచూడొద్దని కుటుంబ సభ్యులకు చెబుతానన్నారు. ఒకవేళ ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆలస్యంగా ఇంటికి వెళ్తే మాత్రం.. ‘‘ఎక్కడికి వెళ్లారు? ఎందుకు చెప్పలేదు?’’ అంటూ జయా ప్రశ్నిస్తారని అమితాబ్‌ వెల్లడించారు.
ఇదీ చదవండి:అడుగుపెట్టగానే ఫేమస్‌.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌ 1971లో ‘గుడ్డీ’ సినిమా సమయంలో తొలిసారి కలుసుకున్నారు. 1973లో వివాహం చేసుకున్న ఈ జంటకు శ్వేతా బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ ఇద్దరు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement