లూయిస్ హామిల్టన్ కూడా ఇంత ఓవర్ చేయడు.. అజిత్‌పై నెటిజన్ల ఫైర్ | Ajith Kumar loses cool at fan seeking selfie video goes Viral on Social media | Sakshi
Sakshi News home page

Ajith Kumar: 'ఎందుకింత ఓవరాక్షన్‌.. లూయిస్ హామిల్టన్ కూడా ఇలా చేయడు'

Sep 14 2026 3:27 PM | Updated on Sep 14 2026 3:47 PM

Ajith Kumar loses cool at fan seeking selfie video goes Viral on Social media

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం కార్ రేస్‌తో బిజీగా ఉన్నారు. యూకేలోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసులో ఆయన పాల్గొన్నారు. ఈ పోటీలకు తమిళనాడు సీఎం విజయ్ సైతం హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరు కలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ఈవెంట్‌లో అజిత్ కుమార్ వ్యవహరించిన తీరుపై మాత్రం నెటిజన్స్ మండిపడుతున్నారు. ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించగా అజిత్ సీరియస్ అయ్యారు. అతని వైపు కోపంగా చూస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

సెల్ఫీ కోరిన అభిమానిపై అజిత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై నెటిజన్స్‌ విమర్శిస్తున్నారు. అభిమానులు అనే వారే లేకపోతే మీరు జీరో అంటూ అజిత్‌పై మండిపడుతున్నారు. తన అభిమానుల పట్ల అజిత్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కొందరు విమర్శలు చేస్తున్నారు. అభిమానులు లేకపోతే, అజిత్ పెద్ద సున్నా అంటూ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అజిత్ ఎందుకింత దురుసుగా ప్రవర్తిస్తున్నాడు? ఇలాంటి వాళ్లు లేకపోతే నువ్వు, నీ కుటుంబం సున్నా.. ఇప్పటికైనా ఈ దురుసుతనాన్ని పక్కన పెట్టి నవ్వు.. దీనికి నీకేమీ ఖర్చు కాదంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఫార్ములా 1 స్టార్ లూయిస్ హామిల్టన్ కూడా ఇలా ప్రవర్తించడంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. మొత్తానికి అజిత్ తీరుపై నెటిజన్స్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement