అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, వీకే నరేశ్, అఖిల్ ఉడ్డెమారి నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘కాకా ధూమ్...’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.
కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ చేశారు. ‘కాకా ధూమ్ ధమాకా, లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక, అరే బాపు రచ్చ లేపు, ఈడ గుమ్మిగూడాక, మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు...’ అంటూ ఈ పాట సాగుతుంది.


