పైలా ప్రసాద్, ఖాన్ దురాని, సాహితి, కిషోర్
ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా హాజరయ్యారు.
వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘కళ్యాణం కమనీయం జీవితం’ సినిమా చిన్నదే గానీ తీసిన వాళ్లు చిన్నవాళ్లు కాదు. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి’’ అన్నారు పైలా ప్రసాద్ రావు. ‘‘ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది’’ అని కిషోర్ గుండాల పేర్కొన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది’’ అని రవి లోకిరెడ్డి తెలిపారు.


