వృషకర్మ ఫిక్స్‌ | Naga Chaitanya Vrushakarma set for December 4 release | Sakshi
Sakshi News home page

వృషకర్మ ఫిక్స్‌

Sep 11 2026 12:37 AM | Updated on Sep 11 2026 12:37 AM

Naga Chaitanya Vrushakarma set for December 4 release

నాగ చైతన్య హీరోగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారైంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది యూనిట్‌. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ .బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘‘మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాలతో  ఎవరూ టచ్‌ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో నాగ చైతన్య వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, స్పర్శ్‌ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, కెమెరా: రాగుల్‌ హెరియన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement