హైదరాబాద్‌లో ‘జై గౌరీపుత్ర గణేశా’ చిత్రబృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా విడుదల చేసింది. విద్యార్థులపై పెరుగుతున్న విద్యా ఒత్తిడి, దాని కారణంగా ఎదురవుతున్న మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణ వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం తెలిపింది.
చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్‌లో విద్యార్థుల జీవితాల్లో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక సంఘర్షణలను చూపించడంతో పాటు వాటి నుంచి బయటపడేందుకు అవసరమైన సందేశాన్ని అందించేలా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


